RRR Movie: అలా జరిగితే చరణ్, తారక్ అంగీకరిస్తారా?

  • December 14, 2022 / 07:41 PM IST

దర్శకధీరుడు రాజమౌళికి ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందనే సంగతి తెలిసిందే. మహేష్ సినిమా పూర్తైన తర్వాత రాజమౌళి తెరకెక్కించే సినిమా ఇదే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కు సంబంధించి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన లైన్ చెప్పారని ప్రస్తుతం ఆ లైన్ ను పూర్తిస్థాయి కథగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే రాజమౌళి ఏ సినిమాను తెరకెక్కించినా కథకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలనే ఆలోచిస్తారు తప్ప పాత్రల నిడివిని పట్టించుకోరు.

ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ అని ప్రచారం జరిగిన అలియా భట్ ఆ సినిమాలో కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే కనిపించారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ను తెరకెక్కించినా చరణ్, తారక్ లలో ఒకరి పాత్ర కొంచెం ఎక్కువగా హైలెట్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో చరణ్, తారక్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా జోరుగా తమ హీరో పాత్రే హైలెట్ గా నిలిచిందనే చర్చ జరిగింది.

స్క్రీన్ స్పేస్ విషయంలో చరణ్ పైచేయి సాధిస్తే కొమరం భీముడో సాంగ్ తో జూనియర్ ఎన్టీఆర్ మార్కులు కొట్టేశాడని ప్రేక్షకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ తెరకెక్కినా ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ లో ఇద్దరి పాత్రలను సమానంగా తెరకెక్కించేలా కథను సిద్ధం చేయని పక్షంలో చరణ్, తారక్ సీక్వెల్ కు అంగీకరిస్తారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ విషయంలో జక్కన్న ముందడుగు వేస్తారో లేదో చూడాల్సి ఉంది. బాహుబలి 3 సినిమాను తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నా ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించడం సులువు కాదు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus