యానిమల్, హాయ్ నాన్న, సలార్ మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా?

  • November 24, 2023 / 05:58 PM IST

డిసెంబర్ నెలలో విడుదలవుతున్న సినిమాలలో ఎక్కువ సంఖ్యలో క్రేజీ సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల 1వ తేదీన యానిమల్ రిలీజ్ కానుండగా డిసెంబర్ నెల 7వ తేదీన హాయ్ నాన్న డిసెంబర్ నెల 22వ తేదీన రిలీజ్ కానుండటం గమనార్హం. అయితే ఈ మూడు సినిమాల మధ్య ఉన్న లింక్ ఇదేనంటూ వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. యానిమల్, సలార్ సినిమాలలో తండ్రీ కొడుకుల ఎమోషన్ హైలెట్ గా నిలవనుందని హాయ్ నాన్న సినిమాలో తండ్రీ కూతురు ఎమోషన్ హైలెట్ గా నిలిచే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.

ఈ మూడు సినిమాల మధ్య ఉన్న లింక్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ మూడు సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు. యానిమల్ ట్రైలర్ కు అన్ని భాషల్లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది.

పఠాన్, జవాన్ సినిమాలతో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించిన బాలీవుడ్ ఇండస్ట్రీకి యానిమల్ సినిమాతో మరో భారీ సక్సెస్ దక్కడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

సలార్ (Salaar) సినిమా ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది. సలార్ మూవీ 2023 బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్ మూవీ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus