Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పెదకాపు మూవీకి లింక్ ..ఏం జరిగిందంటే?

  • September 13, 2023 / 04:58 PM IST

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాత ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీ కానున్నారు. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది.

ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ కు పెదకాపు మూవీకి లింక్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన పెదకాపు1 సినిమా ఈ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ పోస్టర్లలో హీరో పవన్ స్టైల్ లో కనిపించడం, టైటిల్ లో కాపు అని ఉండటంతో పవన్ కు ఈ సినిమాకు లింక్ ఉందని ప్రచారం జరిగింది.

అయితే పెదకాపు మేకర్స్ మాత్రం (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాకు ఎలాంటి లింక్ లేదని వైరల్ అవుతున్న ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు. పెదకాపు1 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. పెదకాపు1 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

స్కంద, చంద్రముఖి2 సినిమాలకు పోటీగా ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో సినీ అభిమానులు ఒకింత నిరాశకు గురవుతున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus