Jr NTR,Vakkantham Vamsi: ఎన్టీఆర్ వక్కంతం వంశీ కాంబోలో ఇప్పట్లో సినిమా కష్టమేనా?

  • May 2, 2023 / 01:55 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా వక్కంతం వంశీకి మంచి పేరు, గుర్తింపు ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలకు వక్కంతం వంశీ కథ అందించారు. తారక్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన టెంపర్ సినిమాకు కథ అందించింది వక్కంతం వంశీ అనే సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఒక సినిమాకు సంబంధించి గతంలో వార్తలు వచ్చాయి. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ సమయంలో ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు.

 వక్కంతం వంశీకి డైరెక్టర్ గా తొలి సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా భారీ షాకిచ్చింది. నితిన్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ రావాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే భవిష్యత్తులో ఎన్టీఆర్ వక్కంతం వంశీ కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ తో సినిమా తీయాలని వక్కంతం వంశీ అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ (Jr NTR) ఇప్పటికే మూడు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్టీఆర్ దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. దిల్ రాజు భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ ఏడాదికి కనీసం ఒక సినిమా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ 2023 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్న వార్2 సినిమాకు రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా విదేశీ అభిమానుల్లో సైతం తారక్ కు క్రేజ్ పెరుగుతోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus