Rakhi, Guntur KaaramGuntur Kaaram: ఈ రెండు సినిమాల మధ్య ఉన్న పోలిక తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

పెద్ద హీరోల సినిమాలకు టైటిల్ ఎంత ముఖ్యమో ట్యాగ్ లైన్ కూడా అంతే ముఖ్యమనే సంగతి తెలిసిందే. ట్యాగ్ లైన్ విషయంలో దర్శకులు చేసే కసరత్తు అంతాఇంతా కాదు. ట్యాగ్ లైన్ వల్ల సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. గుంటూరు కారం సినిమాకు హైలీ ఫ్లేమబుల్ అనే ట్యాగ్ లైన్ ఉందనే సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యాన్స్ కు సైతం ఈ ట్యాగ్ లైన్ ఎంతగానో నచ్చింది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ సినిమాకు కూడా ఇదే ట్యాగ్ లైన్ ఉంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అటు మహేష్, ఇటు తారక్ అభిమానులు షాకవుతున్నారు. రాఖీ సినిమాకు ఉన్న ట్యాగ్ లైన్ గురించి తెలియకపోవడం వల్ల ఈ విధంగా జరిగిందా? లేక తెలిసే ఈ విధంగా జరిగిందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు సోషల్ మీడియాలో గుంటూరు కారం గ్లింప్స్ కు వస్తున్న అదిరిపోయే రెస్పాన్స్ ను చూసి ఫ్యాన్స్ సైతం ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సినిమా గ్లింప్స్ కు ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గ్లింప్స్ కు ఈ స్థాయిలో వ్యూస్ రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 13వ తేదీన విడుదల కానుంది.

దాదాపుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో (Guntur Kaaram) ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఈసారి కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ త్రివిక్రమ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించేలా ఈ సినిమాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus