కొత్త కథలు రాయలేకనో, రీమేకులు వర్కవుట్ అవ్వడం లేదనో ఈమధ్య అన్నీ ఇండస్ట్రీలు బయోపిక్కుల మీద పడ్డాయి. క్రికెటర్, డాన్, టెర్రరిస్ట్, బిజినెస్ మ్యాన్, స్పొర్ట్స్ పర్సనాలిటీ, పాపులర్ సినిమా ఆర్టిస్ట్. ఇలా అందరి బయోపిక్కులను తీసేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే.. వాటిలో ఎలాంటివి సక్సెస్ అవుతున్నాయి, ఎలాంటివి ఫెయిల్ అవుతున్నాయి అనే విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే.. ఈ బయోపిక్కుల హడావుడి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
ఆల్రెడీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో లెక్కకుమిక్కిలి బయోపిక్కులు తెరకెక్కుతుండగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన “ఘర్షణ, విలన్” వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన కార్తీక్ తన బయోపిక్ ను తానే తీసేందుకు సమాయత్తమవుతున్నాడు. 90ల కాలంలో పాపులర్ హీరో అయిన కార్తీక్ తన కెరీర్ ను ఎందుకో సరిగా కాపాడుకోలేకపోయాడు. కొంచం గ్యాప్ తీసుకొని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయి గుర్తింపు మాత్రం లభించలేదు.
ఇకపోతే.. ఈ బయోపిక్ లో ఆయన కుమారుడు గౌతమ్ హీరోగా నటించే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో తన పర్సనల్ & ప్రొఫెషనల్ లైఫ్ లోని ఎవరికీ తెలియని విషయాలను తెలియజెప్పనున్నానని చెబుతున్నాడు కార్తీక్. మరి ఆయన లైఫ్ లో ఆడియన్స్ ను ఎగ్జైట్ చేసే అంశాలు ఏమున్నాయో, కార్తీక్ జీవితంలో జనాలకు తెలియని చీకటి కోణాలు ఎమున్నాయో చూడాలి.
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!