బిగ్‌బాస్ తెలుగు నాల్గవ సీజన్ వారాలు గడిచే కొద్ది ఉత్కంఠంగా సాగుతోంది. శని, ఆదివారాలు వస్తున్నాయంటే చాలు, హౌస్‌లు ఎవరు ఉంటారు.. ఎవరు వెళతారో అనేదానిపైకి అందరిలో ఉత్కంఠం ఉంటుంది. ఒకవైపు కంటెస్టెంట్లు మరోవైపు అభిమానులు, ఎలిమినేషన్ పైనే ఎక్కువగా ఆందోళణ చెందుతారు. ఇక ఈ వారం విషయనికి వస్తే.. లాస్య, మోనాల్, హారిక, అరియానా, అభిజిత్, సొహైల్‌లు నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరు, బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కుల్లో బలంగా పోరాడుతూ, సేవ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది చూడాలి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ వారం బిబి హౌస్‌లో ఎట్టకేలకు అల్లిర హారిక కెప్టెన్ అవడం విశేషం. గతంలో పలుసార్లు కెప్టెన్సీకి దగ్గరగా వచ్చి, తృటిలో కెప్టన్ అయ్యే చాన్సులు కోల్పోయిన హారిక, ఈసారి మాత్రం మరింతగా పోరాడి, చివరిలో మోనాల్ సాయంతో తన కెప్టెన్ కోరికను తీర్చుకుంది. ఇక ఈ టాస్క్‌లో అఖిల్‌కి సోహైల్, అభిజిత్‌కు అవినాష్, హారికకు మోనాల్ సాయం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా మోనాల్ ధృడంగా నిలబడిన తీరు ఆందరినీ ఆశ్చర్యపర్చింది. అభిజిత్‌ను భుజాల పై ఎత్తుకున్న అవినాష్ ముందుగానే చేతులెత్తేయగా, అఖిల్‌ను మోసిన సోహైల్ తన శక్తికి మించి ప్రయత్నించాడు. అయితే మరోవైపు అందరికి షాక్ ఇస్తూ ఎలాంటి హాడావుడి లేకుండా కూల్‌గా చిరునవ్వుతో హారికను తన భుజలా పై మోసిన మోనాల్ చివరి వరకు నిలిచి హారికను కెప్టెన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది
దీంతో ఇలాంటి సిట్యువేషన్ ఊహించని అఖిల్.. తనకు మాత్రమే సాధ్యమైన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ష్‌తో ఊగిపోయాడు. అప్పటికే మింగలేక కక్కలేక ఉన్న అఖిల్‌ను, ఓదార్చేందుకు వచ్చిన మోనాల్‌ను ప్రైవసీ కావాలంట పంపించి, కోపంతో చేతిని నేలకేసి కొట్టాడు. నమ్మినవారే తనకు సాయం చేయలేదని, ఏడుపు ఒక్కటే తక్కువ అనేలా అఖిల్ ఫ్రస్టేషన్ చూపించగా, తాను మాత్రం తనని నమ్మి వచ్చిన వారికి సాయం చేసి, గేమ్‌ను గేమ్‌లా ఆడానని కూల్‌గా తను చేసిన పనిని సమర్ధించుకుంది. ఏది ఏమైనా మిత్రులు శత్రువులుగా, శత్రువులు మిత్రువులుగా మారుతూ, ఎప్పటికప్పుడు సమీకరణాలు మారే బిగ్‌బాస్ హౌస్‌లో ఈవారం మాత్రం అందరి మనసులు టచ్ చేసి, మోనాల్ హైలెట్‌గా నిలిచిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
Most Recommended Video
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!