Skanda Movie: ‘స్కంద’ లో హైలెట్స్ అవేనట… బోయపాటి మార్క్ మిస్ అవ్వకుండా..!

  • September 27, 2023 / 04:04 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా సాయి మంజ్రేకర్ కూడా కీలక పాత్రలో నటించింది. టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. సెప్టెంబర్ 28 న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

మాస్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిందీలో కూడా ఈ మూవీ అదే రోజున రిలీజ్ కాబోతుంది.ఇక ఈ చిత్రానికి సంబంధించి హైలెట్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘స్కంద’ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఓ రేంజ్లో ఉంటుందట. అందరికీ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా దర్శకుడు బోయపాటి శ్రీను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.

అలాగే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అలాగే .. లాస్ట్ 20 నిమిషాలు అయితే ఔట్ ఆఫ్ ది బాక్స్ అనే విధంగా ఉంటుందట. మాస్ ఆడియన్స్ పల్స్ అంతా దర్శకుడు బోయపాటికి బాగా తెలుసు. దానికి రామ్ ఎనర్జీ కూడా యాడ్ అవ్వడంతో ‘స్కంద’ కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. మరి ఈ సినిమా (Skanda Movie) మార్నింగ్ షోల టాక్ ఎలా ఉండబోతుందో చూడాలి..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus