ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ మారితే… చాలా సినిమాల డేట్స్ మారిపోతాయి. చాలాసార్లు ఈ మాటలు అనుకోవడం తప్ప.. సాక్ష్యంతో తెలిసింది మాత్రం కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాతే అని చెప్పాలి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా వరుస వాయిదాల వల్ల చాలా పెద్ద సినిమాలే వాయిదాలు పడ్డాయి. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి టాలీవుడ్‌లో కనిపిస్తోంది. కారణంగా ‘సలార్’. అవును ఆ డైనోసార్ సినిమా వల్లే పరిస్థితి అలా వచ్చింది.
ఊరుకు ముందే ఎవరూ అడగకుండానే ఈ ఏడాది సెప్టెంబరు 28న సినిమా విడుదల చేస్తామని చెప్పారు. ఇంత ఎర్లీగా చెప్పేశారు కదా… పక్కా ప్లానింగ్‌తో ఉన్నారేమో అనుకున్నారు సినిమా జనాలు. కానీ కట్ చేస్తే సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చు హింట్లు ఇచ్చారు. అనుకున్నట్లుగా సినిమా కొత్త డేట్‌ను అనౌన్స్ చేసేశారు. మూడు నెలల ఆలస్యంగా అంటే… డిసెంబరు ఆఖరున రిలీజ్ చేస్తున్నారు. డిసెంబరు 22న డైనోసార్ వస్తోందని ప్రకటించారు.
అయితే, ఇప్పుడు ఈ సినిమా డేట్ మారడం వల్ల చాలా మార్పులు జరగబోతున్నాయ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇయర్ ఎండింగ్‌లో సినిమాను తీసుకొచ్చి భారీ వసూళ్లకు సినిమాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. క్రిస్మస్ సెలవులు, ఇయర్ ఎండింగ్ సెలవులను దృష్టిలో పెట్టుకుని నాని ‘హాయ్ నాన్న’, వెంకటేశ్ ‘సైంధవ్’, నితిన్ ‘ఎక్స్‌ట్రా- ఆర్డినరీ మ్యాన్’ లాంటి సినిమాలు కొన్ని నెలల క్రితమే డేట్ ప్రకటించాయి. డిసెంబర్ 22న వస్తాం రెడీగా ఉండండి అని చెప్పేశారు.
ఈ మేరకు ప్రచారాలు కూడా మొదలుపెట్టాయి. అయితే ఇప్పుడు ఆ డేట్‌కి ‘సలార్’ వస్తుండటంతో రిలీజ్ డేట్స్ మార్చే పనిలో ఉన్నారు. ఎందుకంటే ‘సలార్’లో పాన్ ఇండియా సినిమాకు పోటీగా సినిమా దింపే పరిస్థితి లేదు. అయితే తర్వాత రోజులకు వెళ్లాలి. లేదంటే ముందుకు రావాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రీపోన్ చేసుకోవడానికే ఛాన్స్‌లు ఎక్కువ ఉన్నాయంటున్నారు. మరి ఆయా సినిమాల దర్శకనిర్మాతలు ఏం చేస్తారో చూడాలి.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !