Leonardo DiCaprio: తన కంటే 30 ఏళ్ల చిన్నదైన భారత మోడల్‌తో డేటింగ్‌ చేస్తున్నహీరో డికాప్రియో!

భారత సంతతి మోడల్ నీలమ్ గిల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టైటానిక్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోతో నీలమ్ డేటింగ్ చేస్తోందనే వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. లియోనార్డో డికాప్రియో మోడల్ నీలం గిల్‌తో కనిపించిన తర్వాత మరోసారి డేటింగ్ పుకార్లకు చక్కర్లు కొడుతున్నాయి. మే 31, మంగళవారం లండన్‌లోని చిల్టర్న్ ఫైర్‌హౌస్‌లో భారతీయ సంతతికి చెందిన మోడల్ నీలమ్, ఆమె తల్లితో కలిసి ఓ రెస్టారెంట్ లో లియోనార్డో భోజనం చేస్తూ కనిపించాడు.

దీంతో మళ్ళీ డేటింగ్ పుకార్లు తెరమీదకు వచ్చాయి. (Leonardo DiCaprio) డికాప్రియో వయసు 58 ఏళ్లు కాగా, నీలమ్ వయసు 28 సంవత్సరాలు. నీలమ్ తాతలు భారతదేశంలోని పంజాబ్‌కు చెందినవారు. ఆమె ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయింది. అక్కడ లియోనార్డో తన చిత్రం కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ ప్రదర్శనకు కూడా హాజరయ్యారు. నీలమ్ గిల్‌ బ్రిటీష్-పంజాబీ మోడల్. 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది.

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటుంది. ఇటీవల ఆమె భారత దేశానికి వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ నిర్వహిస్తున్న నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె విచ్చేసింది. మరోవైపు డికాప్రియో ప్రియురాళ్ల జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. 58 ఏళ్లు ఈ టైటానిక్ హీరో తన జీవితంలో ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు.

చాలా మందితో డేటింగ్ చేశాడు. చివరగా మోడల్, నటి కామిల్లాతో నాలుగేళ్ల పాటు కలిసుండి 2022లో విడిపోయాడు. ఇప్పుడు తనకంటే దాదాపు 30 ఏళ్ల చిన్నదైన భారత సంతతికి చెందిన నీలమ్ తో డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus