NBK108: బాలయ్య 108 .. కి అదే టైటిల్ ఫిక్స్ చేశారట!

బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్.బి. కె 108… వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రూపొందుతుంది. ఈ చిత్రానికి ఇది టైటిల్ అని ఇంకా టీమ్ వెల్లడించింది లేదు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే వరకు..తన సినిమాల టైటిల్ ను రివీల్ చేయకూడదు అనే సెంటిమెంట్ ఉంది. దసరా కి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి.. జూన్ 10 లేదా ఆగస్ట్ లో ఈ మూవీ టైటిల్ రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడిచింది.

అంతకు ముందు బ్రో.. ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ను కూడా ఈ మూవీ కోసం అనుకున్నట్టు టాక్ నడిచింది. కానీ బ్రో అనే టైటిల్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫిక్స్ చేశారు.దీంతో ఆ టైటిల్ వద్దనుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రం టైటిల్ ఇదే అంటూ ఇప్పుడు మరో టైటిల్ హల్ చల్ చేస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి భగవత్ కేసరి అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

ఇక (NBK108) ఈ టైటిల్ కు అర్థం… విష్ణువు పేరు గుర్తుచేసే విధంగా ఉందని తెలుస్తుంది. కేసరి అంటే మీనింగ్ సింహం అనే మీనింగ్ కూడా వస్తుంది. భగవత్ కేసరి..అనేది క్యాచీ టైటిల్ కూడా. అయితే గ్లింప్స్ లేదా టైటిల్ పోస్టర్ వచ్చే వరకు ఇది కన్ఫర్మ్ అని నమ్మడానికి లేదు. బాలయ్య తన సన్నిహితుడు అయిన నిర్మాతకి మాటల్లో ఈ టైటిల్ లీక్ చేసినట్టు టాక్.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus