టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘ది వారియర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను ఈరోజు అఫీషియల్ గా విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు రామ్ నిజంగానే వారియర్ లా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన మేకోవర్ కి ఫిదా అవుతున్నారు. పోలీస్ గెటప్ రామ్ కి బాగా సూట్ అయిందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై గొడవ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇదివరకు వేరే బ్యానర్ ఇదే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది. హవీష్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకి ‘వారియర్’ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం కూడా పూర్తయింది. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రామ్ సినిమా టైటిల్ వారికి షాకిచ్చింది. ఈ విషయంలో హవీష్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
రామ్ తన టైటిల్ ‘ది’ అనే పదాన్ని యాడ్ చేసినప్పటికీ.. రెండు సినిమా టైటిల్స్ ఒకేలా ఉండడం హవీష్ అండ్ కో ని ఇబ్బంది పెడుతోంది. ఒకే టైటిల్ తో రెండు సినిమాలు.. ఏకకాలంలో రూపుదిద్దుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో హవీష్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ను సంప్రదించాలని చూస్తున్నారు. మరి ఈ టైటిల్ ని హవీష్, రామ్ లలో ఎవరికి కేటాయిస్తారో చూడాలి. ఇద్దరూ పట్టుబడితే మాత్రం కష్టమే.. ఎవరు వెనక్కి తగ్గుతారో చూద్దాం!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!