తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించినటువంటి డైరెక్టర్ ఏ ఎస్ రవికుమార్ చౌదరి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలలో నిలుస్తున్నారు. గత రెండు రోజుల క్రితం ఈయన ఒక హీరోయిన్ బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం సంచలనగా మారింది. అయితే ఈ విషయం మర్చిపోకముందే హీరో గోపీచంద్ పట్ల తీవ్రస్థాయిలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా గోపిచంద్ గురించి డైరెక్టర్ ఏ ఎస్ రవికుమార్ మాట్లాడుతూ…
ఒరేయ్ అంత బలిసిందా రా నీకు’ (Gopichand) అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ విషయంపై గోపీచంద్ ఏమాత్రం స్పందించకపోయిన ఆయన ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ఏ ఎస్ రవికుమార్ చౌదరికి బాగా బుద్ధి వచ్చేలా చేశారు. సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ పై తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలా గోపీచంద్ అభిమానుల దెబ్బకు ఒక్కసారిగా ఈయన దిగివచ్చి సోషల్ మీడియా వేదికగా అందరికీ క్షమాపణలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ గోపీచంద్ విషయంలో తాను తప్పుగా ప్రవర్తించానని ఆయనను అలా మాట్లాడటం తప్పేనని అందుకు తాను చాలా పశ్చాత్తాపడుతున్నానని తెలిపారు. గోపీచంద్ తనకు బిడ్డలాంటి వాడు అంటూ ఈయన కామెంట్స్ చేశారు. గోపిచంద్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పే అందుకు నన్ను గోపీచంద్ అభిమానులు క్షమించాలని చెబుతూ క్షమాపణలు కోరారు.
ఇక సోషల్ మీడియా వేదికగా తన గురించి వచ్చే ట్రోల్స్ ఆపివేయాలని అలాగే కొందరు తనకు ఫోన్లు చేసి మరి విమర్శలు చేస్తున్నారు అంటూ కూడా ఈయన తెలిపారు. ఇలా అభిమానుల దెబ్బకు దిగి వచ్చినటువంటి ఈయన వారందరికీ క్షమాపణలు చెబుతూ ఈ వివాదానికి ఇంతటితో పులి స్టాప్ పెట్టాలని కోరారు.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!