National Awards: జక్కన్న వల్లే టాలీవుడ్ ఖ్యాతి పెరిగిందా.. ఏం జరిగిందంటే?

నేషనల్ అవార్డ్స్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడూ అన్యాయం జరిగేదని ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి వినిపించేది. అయితే ఈ ఏడాది మాత్రం నేషనల్ అవార్డ్స్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తా చాటుతోంది. రాజమౌళి వల్లే అవార్డ్స్ లో టాలీవుడ్ డామినేషన్ మొదలైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జక్కన్న వల్లే టాలీవుడ్ ఖ్యాతి పెరిగిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాలు దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించాయి.

ఈ సినిమాల వల్ల తెలుగు సినిమాల ఖ్యాతి భాషతో సంబంధం లేకుండా మారుమ్రోగింది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేశారు. రాజమౌళి వల్లే దర్శకనిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో తన రేంజ్ ను మరింత పెంచుకునే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ హాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేసేలా ఉండనుందని ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడం ఖాయమని తెలుస్తోంది.

1000 కోట్ల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. రాజమౌళి ప్రతి సినిమాకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. మహేష్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో హీరో ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. దాదాపుగా రెండున్నరేళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది.

జక్కన్నకు క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. రాజమౌళి తన సినిమాల మార్కెటింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జక్కన్న ప్రతి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు బాలీవుడ్ లో సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus