Tollywood Hero: తమిళ హీరోయిన్ తో డేటింగ్లో ఉన్న టాలీవుడ్ హీరో.!

  • June 3, 2023 / 12:01 AM IST

గతంలో ఒకటి రెండు హిట్లు కొట్టి ఆ వెంటనే ఫేడౌట్ అయిపోయిన హీరోల్లో రిచర్డ్‌ రిషి కూడా ఒకరు. ‘ఏ ఫిల్మ్‌ బై అరవింద్‌’ సినిమాతో హిట్ అందుకున్న రిచర్డ్‌ రిషి ఆ తర్వాత ‘భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా’ అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు. అజిత్ భార్య, హీరోయిన్ షాలినికి ఇతను సోదరుడు. అంటే అజిత్‌కు బావమరిది అనమాట. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. 6 అడుగుల అందగాడే కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.

రామ్ హీరోగా కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రంతో విలన్ గా కూడా మారాడు. ఆ మూవీ ప్లాప్ కావడంతో ఇతను పెద్దగా సక్సెస్ కాలేదు. చివరగా ఇతను ‘ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి’ సినిమాలో కనిపించాడు. తమిళంలో అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్న రిషి.. చాలా కాలం తర్వాత వార్తల్లో నిలిచాడు. విషయం ఏంటంటే ఇతను హీరోయిన్ యషిక ఆనంద్ తో డేటింగ్లో ఉన్నాడట. కొద్దిరోజుల క్రితం రిషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో యషికతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు.

ఓ ఫొటోలో యషిక, రిచర్డ్‌ (Hero) బుగ్గపై ముద్దు పెడుతూ కనిపించింది. దీంతో ఆ వార్తలకు పునాది పడినట్టైంది. రిచర్డ్‌ రిషి వయసు 45 సంవత్సరాలు. ఇక, యషిక వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే కావడంతో వీరి ప్రేమ, డేటింగ్ వ్యవహారాలు హాట్ టాపిక్ అయ్యాయి. ‘ఇద్దరి మధ్య 21 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అలాంటప్పుడు వీళ్ళ బంధం పెళ్లి వరకు వెళ్తుందా?’ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus