జూలై మొదటి వారంలో టాలీవుడ్లో(Tollywood) 2 క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి ‘నాగబంధం’ మరొకటి ‘రావు బహదూర్’. ఈ 2 సినిమాలకి ప్రమోషన్స్ బాగా చేశారు. వీటి సక్సెస్ అనేది హీరోలకి చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలకి సరైన మార్కెట్ లేదు. పైగా వీళ్లపై భారీ బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. ముందుగా సీనియర్ కాబట్టి.. సత్యదేవ్ గురించి మాట్లాడుకుంటే.. ‘జ్యోతి లక్ష్మీ’ నుండి చాలా సినిమాల్లో హీరోగా నటించాడు.
‘బ్లఫ్ మాస్టర్’ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’ వంటి మంచి సినిమాలు ఇతని ఖాతాలో పడ్డాయి. అలాగే మంచి నటుడిగా కూడా ఇతనిపై ఒక పాజిటివ్ ఒపీనియన్ ఆడియన్స్ లో ఉంది. కానీ హీరోగా నిలబడలంటే బాక్సాఫీస్ హిట్ అవసరం. అది సత్యదేవ్ ఖాతాలో ఇంకా పడలేదు. ‘రావు బహదూర్’ పైనే ఇతను ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఎందుకంటే దీనికి వెంకటేష్ మహా దర్శకుడు. ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య’ కాంబో కావడంతో ‘రావు బహదూర్’ పై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫోకస్ ఉంది.
అన్నిటికీ మించి మహేష్ బాబు బ్యాకప్ కూడా ఓ అడ్వాంటేజ్ అని చెప్పాలి. సినిమాకి పర్వాలేదు అనే టాక్ వస్తే చాలు.. సినిమాని మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా లేపుతారు. అప్పుడు సత్యదేవ్ కెరీర్ కూడా సెట్ అయిపోతుంది. ఇక విరాట్ కర్ణ విషయానికి వస్తే.. ‘పెదకాపు’ తో డెబ్యూ ఇచ్చాడు. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు ‘నాగబంధం’ తో రాబోతున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్లు బడ్జెట్ పెట్టామని నిర్మాతలు చెబుతున్నారు.
‘నాగబంధం’ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. విరాట్ కర్ణ మేకోవర్ కూడా బాగుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. సినిమాకి కనుక హిట్ టాక్ వస్తే.. ఇతను గట్టెక్కేసినట్టే..! మొత్తంగా ఈ వారం అటు సత్యదేవ్ కి, ఇటు విరాట్ కర్ణకి చాలా కీలకం అనే చెప్పాలి.