ఇక నుండి మ్యూజిక్ డైరెక్టర్ గా మారానున్న స్టార్ హీరోయిన్!

  • December 5, 2023 / 08:38 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ మొదటి సినిమా నుండే తనదైన మార్కుని ఏర్పాటు చేసుకోవడానికి శృతి హాసన్ చాలా కష్టపడింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అందం తో పాటుగా అద్భుతమైన నటన మరియు డ్యాన్స్ కూడా చెయ్యగల అతి తక్కువ మంది సౌత్ హీరోయిన్స్ లో ఒకరు శృతి హాసన్. అందుకే ఇప్పటికీ కూడా ఆమెకి సూపర్ హిట్స్ పడుతూనే ఉన్నాయ్. క్రేజీ స్టార్ హీరోలు ఆమెకి తమ సినిమాల్లో ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటించిన ‘సలార్’ చిత్రం ఈ నెల 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి ముందు ఆమె ముఖ్య పాత్రలో కనిపించిన ‘హాయ్ నాన్న’ చిత్రం ఈ నెల 7 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే శృతి హాసన్ అతి త్వరలోనే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతుంది అని సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది.

శృతి హాసన్ కి నటన మీద ఆసక్తి చిన్నగా తగ్గిపోతుంది అట. ఆమె డ్రీం రోల్ పూర్తి స్థాయి విలన్ రోల్ చెయ్యాలని అట. ఆ అవకాశం వచ్చినప్పుడు నటిస్తానని, ముందుగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి, వచ్చే ఏడాది నుండి మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ని ఆరంబించాలని కోరుకుంటుంది అట.

శృతి హాసన్ (Shruti Haasan) మంచి సింగర్, ఇది వరకు ఆమె తమిళం లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడింది. అంతే కాకుండా మ్యూజిక్ కూడా నేర్చుకుందట. త్వరలోనే ఆమె ఒక ప్రైవేట్ ఆల్బం కూడా చేయబోతోందని, ఈ ఆల్బం ఆమెకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనేక అవకాశాలను తెచ్చిపెడుతుందని నమ్ముతుంది శృతి హాసన్.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus