టాలీవుడ్ సల్మాన్ ఖాన్ గా ప్రభాస్..?

  • April 29, 2020 / 08:41 PM IST

ఏదైనా జరగాల్సిన సమయంలోనే జరగాలి అంటారు మన పెద్దలు. ముఖ్యంగా పెళ్లి వయసులో ఉన్నప్పుడే చేసుకోవాలి. బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికి రావు అనేది ఫేమస్ సామెత. ఈ ఇతివృత్తం ఎందుకు చెవుతున్నానో…ఎవరి గురించి చెవుతున్నానో మీకు అర్థం అయ్యే ఉంటుంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించే. ఆకట్టుకొనే అందం, అభిమానించ బడే మంచి మనసు, హోదా అన్ని ప్రభాస్ దగ్గర ఉన్నాయి..ఒక్క పెళ్లి చేసుకోవాలనే తపన.. కోరిక తప్ప.

ఎప్పుడో 1979లో పుట్టిన ప్రభాస్ ప్రస్తుత ఏజ్ 40 సంవత్సరాలు, మళ్ళీ అక్టోబర్ వస్తే 41 లోకి ఆయన ఎంటర్ అవుతారు. అంటే ప్రభాస్ మిడిల్ ఏజ్ కి చేరుకున్నట్లే లెక్క. మరి ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. సాహో ప్రొమోషన్స్ లో ప్రభాస్ కి ఎదురైన అతిపెద్ద ప్రశ్న పెళ్లి, ప్రేమ గురించే… ఈ ప్రశ్నకు ప్రభాస్ సమాధానం చెప్పలేక, తప్పించుకోలేక అల్లాడిపోయారు. ఎప్పటికప్పుడు నవ్వుతూ దాటవేసేస్తున్నాడు కాని అసలు విషయం చెప్పడం లేదు.

తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా లేదా అనేది ఎవరికీ తెలియని పెద్ద ఫజిల్. మరి ఈయన చెప్పడానికి సిగ్గుపడుతున్నాడేమో అని, వాళ్ళ పెద నాన్న గారైన కృష్ణం రాజుగారిని అడిగితే ఆయన రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది అంటున్నారు కానీ, ప్రభాస్ ని పెళ్లి పీటలు ఎక్కించలేకపోతున్నాడు. రాను రాను ప్రభాస్ వ్యవహారం చూస్తుంటే సల్మాన్ ఖాన్ వలె బ్యాచ్లర్ గా మిగిలిపోతాడు అనిపిస్తుంది.. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ పెళ్లిపీటలు ఎక్కాలని కోరుకుంటున్నారు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus