అప్పటి వరకూ అపజయమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న... బోయపాటి శ్రీను కి... 'వినయ విధేయ రామ' చిత్రం పెద్ద షాక్ ఇచ్చింది. అప్పటి వరకూ ఉన్న మంచి పేరు పై ఈ చిత్రం చాలా పెద్ధ దెబ్బ కొట్టింది. సహజంగానే యాక్షన్ ఎపిసోడ్స్ డోస్... బోయపాటి సినిమాలో ఎక్కువగా ఉంటాయి అనే రిమార్క్ ఉంది. 'వి వి ఆర్' లో అంతకు మించి... పలనాటి బ్రహ్మనాయుడు రేంజ్ ఎక్స్ట్రాలు పెట్టడంతో... బోయపాటితో తరువాతి సినిమా చెయ్యడానికి కూడా అఖిల్ వంటి హీరోలు పారిపోయారు. ఇక చివరికి బాలయ్య ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి బాలయ్యతో ఓ హిట్టు కొడితే ఆ వెంటనే అల్లు అర్జున్ కూడా బోయపాటికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట. దీంతో బోయపాటి హిట్టు కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బోయపాటి ప్రతీ సినిమాలో యంగ్ హీరోలకు కానీ.. సీనియర్ హీరోలకు కానీ పాత్రలు డిజైన్ చేస్తూ ఉంటాడు. 'సరైనోడు' శ్రీకాంత్...., 'జయ జానకి నాయకా' లో శరత్ కుమార్, 'వినయ విధేయ రామ' ప్రశాంత్ వంటి వారికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు తొట్టెంపూడి వేణు ని తీసుకున్నాడట. గతంలో ఇతనికి ఎన్టీఆర్ తో తీసిన 'దమ్ము' సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడు బోయపాటి. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరి ఈ కాంబో ఈసారి అయినా వర్కౌట్ అవ్వుద్దేమో చూద్దాం. Most Recommended Video దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు