వెంకటేష్ హీరోయిన్ ఇలా అయిపోయిందేమిటి…!

  • May 22, 2020 / 03:00 PM IST

వెంకటేష్ హీరోగా సురేష్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘ధర్మచక్రం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ బ్యూటీ ప్రేమ. తరువాత జగపతి బాబు, నవీన్… వంటి హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన’దేవి’ చిత్రంతో మాత్రం అప్పటి వరకూ ఉన్న తన ఇమేజ్ ను డబుల్ చేసుకుంది అనే చెప్పాలి. ఆ చిత్రంలో నాగ లోకం నుండీ భూమి పైకి వచ్చిన అమ్మాయిగా అద్బుతంగా నటించింది.

అయితే ఆ చిత్రం స్థాయి రేంజ్ లో తరువాత ఈమె నటించిన సినిమాలు హిట్ అవ్వలేదు.’దేవి’ హిట్ అయ్యింది కదా అని ‘నాగ దేవత’ ‘దేవి అభయం’ వంటి అదే తరహా సినిమాలు చేసి సేఫ్ గేమ్ ఆడాలి అని ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలేదు. దాంతో ‘చిరునవ్వుతో’ ‘ఢీ’ వంటి హిట్ చిత్రాల్లో గెస్ట్ రోల్స్ మాత్రమే ఈమెకు వచ్చాయి. అటు తరువాత ఈమెకు అలాంటి పాత్రలు కూడా కరువయ్యాయి. ఎప్పుడైతే సినిమా అవకాశాలు తగ్గాయో… తరువాత పెళ్ళి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

అయితే తన భర్తతో విడాకులు తీసుకుందట. దీంతో ఇప్పుడు మళ్ళీ సినిమాల వైపు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రేమ వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూ లో ఈమె లుక్ ను చూసిన వారంతా షాకవుతున్నారు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus