ఆ ఇద్దరు హీరోలు హ్యాండివ్వడంతో బాలయ్యనే పట్టుకున్నాడట..!

  • July 31, 2020 / 07:00 PM IST

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు.. మీడియం రేంజ్ హీరోలు అందరూ వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ రెండు సినిమాలతో బిజీ, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఇంకా మొదలవ్వలేదు కాబట్టి ఇప్పట్లో ఖాళీ అవ్వలేడు. ఇక ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’… అటు తరువాత త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాల్సి ఉంది. చరణ్ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత సురేందర్ రెడ్డి, కొరటాల శివ, వంశీ పైడిపల్లి.. వంటి దర్శకులతో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ అది పూర్తయిన తరువాత కొరటాల శివ డైరెక్షన్లో సినిమాలు చేయనున్నాడు.

ఇక మీడియం రేంజ్ హీరోలు నాని,విజయ్ దేవరకొండ, అఖిల్, సాయి తేజ్, వరుణ్ తేజ్ లు ఖాళీగా లేరు. కాబట్టి దర్శకుడు అనిల్ రావిపూడికి ఇప్పుడు హీరో దొరకట్లేదని తెలుస్తుంది. గోపీచంద్ ఒక్కడు ఖాళీగా ఉన్నాడు అనుకుంటే.. మారుతీ, సుజీత్ లు అతనితో సినిమాలు చెయ్యడానికి రెడీ అయిపోయారు. వెంకటేష్, వరుణ్ లతో ‘ఎఫ్3’ చెయ్యాలని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నడు అనిల్ రావిపూడి. కానీ ఇప్పుడు వెంకీ ‘నారప్ప’ సినిమా చెయ్యాల్సి ఉంది. మధ్యలో రానా పెళ్లి కూడా ఉంది కాబట్టి ఈ ఏడాది షూటింగ్ లో జాయిన్ అవ్వలేను అని తేల్చి చెప్పేశాడట.

ఇక వరుణ్ కూడా కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఒక్కడే అనిల్ కు ఆప్షన్ అని తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ చిత్రాన్ని 40శాతం కంప్లీట్ చేశాడు.ఒక్కసారి తిరిగి షూటింగ్ ప్రారంభం అయితే 2 నెలల్లో ఆ చిత్రాన్ని ఫినిష్ చేసెయ్యాలని బాలయ్య ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఎప్పటి నుండో అనిల్ రావిపూడితో సినిమా చెయ్యాలని బాలయ్య కూడా ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యనే బాలయ్యను మరోసారి అనిల్ సంప్రదించాడట. కాబట్టి త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus