35 ఏళ్ళు వచ్చాక కానీ కాజల్ పెళ్లి చేసుకోలేదు. 30 ఏళ్ల తమన్నా ఇప్పుడప్పుడే పెళ్లి ప్రస్తావన ఎత్తే సమస్యే లేదు. ఇలా 30 ఎల్లా దగ్గరలో ఉన్న హీరోయిన్లు కోకొల్లలు. వీళ్ళలో చాలామందికి కెరీర్ సరిగా లేదు, ఆశించిన స్థాయి విజయం ఒక్కటి కూడా అందుకోలేకపోయారు. ఐయినప్పటికీ.. ఎప్పుడో ఒకప్పుడు ఒక్క విజయమైనా దక్కకపోదా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అలాంటిది.. ఒక డీసెంట్ హిట్ అందుకున్న యువ కథానాయకి మాత్రం అప్పుడే పెళ్లి చేసేసుకోంటోంది.
ఆమె మరెవరో కాదు “రాజావారు రాణి గారు” చిత్ర కథానాయకి రహస్య గోరక్. “రాజావారు రాణి గారు” మంచి విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. హీరో అయితే.. ఆల్రెడీ రెండు సినిమాలు కూడా ఎనౌన్స్ చేసాడు. కానీ.. రహస్య మాత్రం రహస్యంగా పెళ్లి పీటలెక్కేసింది. ఇటీవల ఆమె పెళ్ళికూతుర్ని చేసే వేడుక పరిమిత కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది.
మంచి హిట్ చేతిలో పెట్టుకొని, బోలెడన్ని ఆఫర్లు కూడా వస్తున్నా తరుణంలో ఇలా సైలెంట్ గా పెళ్లి చేసుకోవడం వెనుక కారణం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. ఇకపోతే.. పెళ్ళైన తర్వాత సినిమాలు చేస్తుందో లేదో అనే విషయంలో కూడా క్లారిటీ లేదు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?