ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరానీలలో టాప్ డైరెక్టర్ అతనేనా.. ఏమైందంటే?

డంకీ, సలార్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ అవుతుండగా డంకీ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. రాజ్ కుమార్ హిరానీ గత సినిమాల స్థాయిలో ఈ సినిమా లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ప్రశాంత్ నీల్ వర్సెస్ రాజ్ కుమార్ హిరానీలలో టాప్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు డైరెక్షన్ విషయంలో ఈ ఇద్దరూ దాదాపుగా సమానమేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు డైరెక్టర్ల ట్రాక్ రికార్డ్ చూసి ఈ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశపరిచిన సందర్భాలు అయితే లేవనే చెప్పాలి. క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో రాజ్ కుమార్ హిరానీ తోపు కాగా మాస్ ప్రేక్షకులను మెప్పించే విషయంలో ప్రశాంత్ నీల్ తోపు అని చెప్పవచ్చు. ప్రశాంత్ సినిమాలకు, రాజ్ కుమార్ హిరానీ సినిమాలకు 8 కంటే ఎక్కువగా ఐఎండీబీ రేటింగ్ ఉండటం గమనార్హం.

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కేజీఎఫ్2 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించగా రాజ్ కుమార్ హిరానీ సినిమాలు మాత్రం ఈ రేంజ్ లో సాధించలేదు. అయితే ఈ డైరెక్టర్ల సినిమాలను ఇష్టపడే అభిమానులు మాత్రం దాదాపుగా సమానంగా ఉన్నారనే చెప్పాలి. డంకీ రిజల్ట్ ఇప్పటికే తేలిపోగా సలార్ కు ఎలాంటి టాక్ వస్తుందో చూడాల్సి ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సలార్ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. డంకీ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రాకపోవడం సలార్ కు ప్లస్ కానుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్న అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సలార్ మూవీ 270 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus