జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్). ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రదర్‌గా మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించబోతున్నాడంటూ చాలా కాలం ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఈ రూమర్స్‌పై టొవినో థామస్ స్వయంగా క్లారిటీ ఇస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు.రీసెంట్‌గా ఓ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన టొవినో.. ‘డ్రాగన్’ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను ఈ సినిమాలో నటించడం లేదని తేల్చి చెప్పాడు. దీనికి ప్రధాన కారణం డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమేనని వివరించాడు.
ముఖ్యంగా టాలీవుడ్, మాలీవుడ్ వర్కింగ్ స్టైల్స్ మధ్య ఉన్న తేడాను ఆయన ఓపెన్‌గానే పాయింటౌట్ చేశాడు. మలయాళంలో సినిమాలు సింగిల్ షెడ్యూల్‌లో చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతాయని, కానీ తెలుగులో బడా ప్రాజెక్టులు ఏళ్ల తరబడి సాగుతాయని అన్నాడు. ‘ఒక తెలుగు సినిమా కోసం ఏడాది పాటు డేట్స్ ఇస్తే.. ఆ గ్యాప్‌లో నేను కనీసం నాలుగు మలయాళ సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది. ఒకే ప్రాజెక్ట్ కోసం అంత టైమ్ కేటాయించడం నావల్ల కాదు’ అని టొవినో కుండబద్దలు కొట్టాడు. దీంతో ఈ మలయాళ టాలెంటెడ్ యాక్టర్ ‘డ్రాగన్’ నుంచి తప్పుకున్నట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది.
‘డ్రాగన్’ విషయానికొస్తే.. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. అయినా ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా ఫస్ట్ లుక్ కూడా రాకముందే.. నార్త్ అమెరికా, యూకే ఓవర్సీస్ రైట్స్ ఏకంగా రూ.55 కోట్లకు అమ్ముడుపోవడం ఈ కాంబో స్టామినాకు నిదర్శనం. ఇప్పుడు టొవినో తప్పుకోవడంతో.. ఆ బ్రదర్ క్యారెక్టర్ కోసం ప్రశాంత్ నీల్ ఎవరిని తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.