Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

‘కె జి ఎఫ్’ ‘కె జి ఎఫ్ 2’ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న యష్ (Yash) .. ఆ తర్వాత ఆల్మోస్ట్ 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ‘టాక్సిక్’ (Toxic) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. కానీ అవి బాగా వైరల్ అయ్యాయి. అందుకు కారణం బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం. గతంలో ఇలాంటి కంటెంట్ తో వచ్చిన ‘యానిమల్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ‘టాక్సిక్’ (Toxic) చిత్రాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు అని అంతా అనుకున్నారు.

Toxic Movie Collections

అయితే మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వారంతా ‘టాక్సిక్’ పై విమర్శల వర్షం కురిపించారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది ‘టాక్సిక్’. కానీ 2వ రోజు నుండీ వసూళ్ళు దారుణంగా పడిపోయాయి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  8.26 cr
సీడెడ్  1.60 cr
ఆంధ్ర(టోటల్) 5.61 cr
కర్ణాటక 23.97 cr
తమిళనాడు 4.80 cr
కేరళ 1.69 cr
నార్త్ 54.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.2 cr
 ఓవర్సీస్ 12.60 cr
వరల్డ్ వైడ్ టోటల్  120.23 cr(షేర్)

‘టాక్సిక్’ (Toxic) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.425 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.430 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.105 కోట్ల బిజినెస్ చేసింది. అందులో రూ.50 కోట్ల వరకు రిటర్నబుల్ అడ్వాన్స్ ఉందని వినికిడి. ఏదేమైనా వరల్డ్ వైడ్ రూ.430 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే చిన్న విషయం కాదు. 3 రోజుల్లో ఈ సినిమా రూ.120.23 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.223 కోట్లు కొల్లగొట్టింది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా.. 2వ రోజు నుండీ బాగా డౌన్ అయ్యింది.  బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.309.77 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus