Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

[Click Here For Full Review]

‘కే జీ ఎఫ్’ ‘కే జీ ఎఫ్ 2’ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు యష్. ఆ సినిమాలో రాకీ భాయ్ గా జీవించేశాడు. ఆ సినిమాతో మాస్ కి సరికొత్త డెఫినిషన్ చెప్పాడు. సాధారణంగా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న ఏ హీరో అయినా వరుస సినిమాలు ఓకే చేసి.. చేతినిండా సంపాదించాలని కోరుకుంటాడు. కానీ యష్ మాత్రం అలాంటి స్టెప్ తీసుకోలేదు. ‘టాక్సిక్'(Toxic) సినిమా కోసం ఆల్మోస్ట్ 3 ఏళ్ళు కష్టపడ్డాడు.

Toxic

గీతూ మోహన్ దాస్ అనే లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా చేశాడు. ‘డబ్బు కోసం కాదు.. ఇండియన్ సినిమా స్థాయి పెంచేందుకు ఎంతో ప్యాషన్ తో ఈ సినిమా చేశాను’ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు యష్. అతని కామెంట్స్ అందరినీ ఇంప్రెస్ చేశాయి. సినిమా ఎలా ఉండబోతోంది అనేది స్టేజిపైనే చెప్పేశాడు యష్. ‘టాక్సిక్ ఈజ్ బోల్డ్, టాక్సిక్ ఈజ్ ఒరిజినల్..’ అంటూ ఆడియన్స్ ను బాగా ప్రిపేర్ చేశాడు యష్. దిల్ రాజు ‘టాక్సిక్’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

[Click Here For Full Review]

ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి, స్నేహితులకి ‘టాక్సిక్’ చిత్రాన్ని చూపించారు దిల్ రాజు. సినిమా చూసిన అనంతరం తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘టాక్సిక్’ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుండీ చాలా రిచ్ గా ఉంటుందట. మొదటి 15 నిమిషాలకే సినిమా చూస్తున్న ఆడియన్స్ అంతా ‘టాక్సిక్’ ప్రపంచంలోకి వెళ్లిపోతారట. చాలా బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని… కానీ యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయని అంటున్నారు.

సెకండాఫ్లో వచ్చే ఎమోషనల్ ట్రాక్ కన్వెన్సింగ్ గా ఉందని అంటున్నారు. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు ‘టాక్సిక్’ చిత్రం గూజ్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. లార్జర్ థేన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో ‘టాక్సిక్’ చిత్రం నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యింది అని చెబుతున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజు మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..!

[Click Here For Full Review]

ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus