Pawan Kalyan: ‘ఓజి’ మూవీ గ్లింప్స్ గురించి వైరల్ అవుతున్న మీమ్స్ చూశారా?

  • September 2, 2023 / 06:41 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ‘సాహో’ దర్శకుడు సుజీత్ కలయికలో ‘ఓజి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డీవీవీ దానయ్య.. ఈ చిత్రానికి నిర్మాత.ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో.. చిత్రబృందం 100 సెకన్ల నిడివి కలిగిన గ్లింప్స్ ను విడుదల చేసింది. గ్లింప్స్ లో పవన్ కు ఇచ్చిన ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

“పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా..?అది మట్టి చెట్లతో పాటు ఊరినే ఊడ్చేసింది కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాన్ కడగలేకపోయింది” అంటూ హీరోకి ఇచ్చిన ఎలివేషన్.. ఆ తర్వాత వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , వాయిస్ ఓవర్ ఇచ్చిన అర్జున్ దాస్ గొంతు.. చాలా బాగా సెట్ అయ్యింది. గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ యాక్షన్ షాట్స్ అలాగే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్స్ అని చెప్పొచ్చు.

దర్శకుడు సుజీత్.. (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావడంతో .. స్కై ఈజ్ ది లిమిట్ అనే విధంగా ఎలివేషన్స్ దట్టించినట్టు ఈ ఒక్క గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ‘ఓజి’ గ్లింప్స్ తో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు 5 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ఓజి సినిమా పై కొన్ని ఇంట్రెస్టింగ్ మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus