Trivikram: త్రివిక్రమ్ లిస్ట్ లో ఇద్దరు స్టార్ హీరోలు!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అల వైకుంఠపురములో’ సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమా మొదలుపెట్టలేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్.. త్రివిక్రమ్ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యారు త్రివిక్రమ్. అలానే మరోపక్క తన తదుపరి సినిమాలను కూడా లైన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు త్రివిక్రమ్.

Click Here To Watch NOW

ఇటీవల అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలను కలిశారు త్రివిక్రమ్. వీరిద్దరితో చెరొక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కచ్చితంగా వీరి కాంబినేషన్ లో సినిమాలు ఖాయమని తెలుస్తోంది. త్రివిక్రమ్ స్క్రిప్ట్స్ కూడా లాక్ చేశారని టాక్. ఈ ఏడాది లోపు మహేష్ సినిమా పూర్తి చేసి వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇద్దరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ముందుగా కొరటాల శివ సినిమాను పూర్తి చేయనున్నారు.

ఆ తరువాత లిస్ట్ లో చాలా మంది దర్శకులు ఉన్నారు. మరి త్రివిక్రమ్ కి ముందుగా డేట్స్ ఇస్తారేమో చూడాలి. మరోపక్క అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా పనుల్లో బిజీ కానున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్ అలానే బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు లిస్ట్ లో త్రివిక్రమ్ కూడా యాడ్ అయ్యారు. రాబోయే నెలల్లో ఏ సినిమా ఎప్పుడు మొదలుపెడతారనే విషయంలో క్లారిటీ రానుంది.

ఇప్పటికైతే అన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. మరో రెండు, మూడేళ్లలో టాలీవుడ్ లో క్రేజీ సినిమాలు రాబోతున్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus