త్రివిక్రమ్ ని వెంటాడుతున్న లీకుల గోల!

  • February 19, 2016 / 09:29 AM IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అ..ఆ’. ఇటీవల టైటిల్ పోస్టర్ ని విడుదల చేసిన త్రివిక్రమ్ త్వరలో ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలనీ భావించిగా తాజాగా ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కాస్త లీక్ అయి సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ లీక్ అవడంతో షాక్ అయిన చిత్ర యూనిట్ ఇక నుండి పూర్తి జాగ్రత్తగా ఉండనున్నారు.ఇప్పుడు జాగ్రత్త పడకపోతే,సినిమా మొత్తం లీక్ అవుతుందేమోనని,ఇక నుంచి ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా గమనించాలని చిత్ర యూనిట్ ను సూచించాడని వినికిడి.
గతంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం యొక్క ఫస్ట్ ఆఫ్ మొత్తం ఇంటర్నెట్ లో లీకై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుండే లీక్ భారిన పడటంతో,మళ్లీ ఇటువంటి పొరపాటులు జరగకుండా చిత్ర యూనిట్ అప్రమత్తమైంది.ఏదేమైనా త్రివిక్రమ్ కు సినిమా విడుదల అయేంతవరకు ఈ గోల తప్పదేమో. ఈ చిత్రాన్ని మార్చి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మరి అప్పటివతకు ఈ సినిమాను లీకులనుండి  కాపాడుకోవడం కోసం టీం అంత కష్టపడాల్సిందే. లేకుంటే ‘అత్తారింటికి దారేది’సినిమాకి పట్టిన గతి పడుతుందేమోనని భయం తో ఉన్నట్టు వినికిడి.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus