The Rajasaab: ది రాజాసాబ్’ కొత్త పోస్టర్ పై ట్రోలింగ్ షురూ!

  • October 23, 2024 / 05:09 PM IST

ఈరోజు అనగా అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. కాబట్టి అభిమానులు ఆయన నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ ని ఆశిస్తారు. ఈ క్రమంలో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) మేకర్స్ ఓ అప్డేట్ ఇస్తున్నట్టు నిన్ననే ప్రకటించారు. దీంతో ఏదైనా టీజర్ లాంటిది రిలీజ్ చేస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ ‘ది రాజాసాబ్’ లో ప్రభాస్ కి  (Prabhas)  సంబంధించిన మరో లుక్ ని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

The Rajasaaab

ఇందులో ప్రభాస్ నెరిసిన జుట్టు, గడ్డంతో, నోట్లో సిగార్ పెట్టుకుని భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇది హర్రర్ రొమాంటిక్ కామెడీ సినిమా అని మేకర్స్ ముందు నుండి చెబుతూనే వచ్చారు. అలాగే ఇందులో ప్రభాస్ ఓ దెయ్యంలా కనిపిస్తాడని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ పోస్టర్ ని వదిలినట్టు స్పష్టమవుతుంది. ఇక ఈ పోస్టర్ ని చూసిన ప్రభాస్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఇక యాంటీ ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు.

‘నాగవల్లి’ (Nagavalli) సినిమాలో వెంకటేష్ (Venkatesh) అఘోర పాత్రని గుర్తు చేస్తూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగానే ప్రభాస్ కి సంబంధించిన ఏ అప్డేట్ అయినా ఓ రేంజ్లో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా అలాగే ట్రెండ్ అవుతుంది కానీ.. ఇది కొంచెం నెగిటివ్ ట్రెండ్ అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ..

మేకర్స్ ఈ పోస్టర్ ను (The Rajasaab) విడుదల చేసి ఓ రకంగా మంచి పనే చేశారు అని చెప్పాలి. ఎందుకంటే.. ప్రభాస్ సెకండ్ లుక్ ఎలా ఉంటుంది అనే ఒక క్లారిటీ వచ్చింది. సో ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి.. రిలీజ్ తర్వాత ఆ రేంజ్లో ట్రోలింగ్ ఉండకపోవచ్చు.

గచైతన్య కోసం కథను సెట్‌ చేసిన హీరో.. నిర్మాతగా మారి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus