Prabhas: బాక్సాఫీసు కా బాస్‌.. ప్రభాస్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  • October 22, 2024 / 09:53 PM IST

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (S. S. Rajamouli)  అయితే.. ఆ సినిమాను భుజాన మోసింది ప్రభాస్‌ (Prabhas) . ‘బాహుబలి’ (Baahubali) అంటే ప్రభాస్‌ అంటే ‘బాహుబలి’ అనేలా ఆ రోజుల్లో పేరు మారుమోగింది. ఆ తర్వాత సరైన విజయం పడక ఇబ్బంది పడినా.. రీసెంట్‌గా ‘సలార్‌’ (Salaar) సినిమాతో తానేంటో మరోసారి నిరూపించాడు. వందల కోట్ల వసూళ్లు తన పెద్ద విషయం కాదని చెప్పకనే చెప్పాడు. ఈ రోజు ఈ టాలీవుడ్‌ డార్లింగ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం!

Prabhas

* ప్రభాస్‌ అంటే.. ప్రభాస్‌ రాజు, డార్లింగ్‌ అని మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్‌ రాజు.

* ప్రభాస్‌ ఓ బాలీవుడ్‌ సినిమాలో కేమియో చేశాడు. అజయ్‌ దేవగణ్‌ – సోనాక్షి సిన్హా నటించిన ‘యాక్షన్‌ జాక్షన్‌’లోని ఓ పాటలో కనిపిస్తాడు.

* మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు విగ్రహం ఘనతను అందుకున్న తొలి దక్షిణాది నటుడు ప్రభాసే.

* ప్రభాస్‌కు హాలీవుడ్‌ యాక్టర్‌ రాబర్ట్‌ డినిరో అంటే ఇష్టం. దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ పనితనం అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు రిపీట్‌లో చూస్తాడు.

* హిరానీ మీద అభిమానంతో ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘3 ఇడియట్స్‌’ సినిమాలను 20 సార్లు చూశాడట డార్లింగ్‌.

* ప్రభాస్‌కు యూరప్‌ అంటే ఇష్టం. సినిమా రిలీజ్‌కు ముందు అక్కడకు వెళ్లిపోయి సేదతీరుతుంటాడు.

* ప్రభాస్‌కి చాలా బద్ధకం. ఆయనతో పరిచయం ఉన్నవాళ్లు, ఆయనతో కలసి పని చేసినవాళ్లు ఈ మాట చాలా సందర్భాల్లో చెప్పారు.

* ప్రభాస్‌ భీమవరంలోని డీఎన్‌ఆర్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ చదివాడు. హైదరాబాద్‌ శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్ చదివాడు.

* సినిమాల్లోకి రాకపోయుంటే ఫుడ్‌ బిజినెస్‌లోకి వెళ్లేవాడినని ప్రభాస్‌ చెబుతుంటాడు. ఆయన ఆతిథ్యం అద్భుతం అనేది ఇండస్ట్రీ మాట.

* ప్రభాస్‌కు బటర్‌ చికెన్‌, బిరియానీ అంటే ఇష్టం. తోటి నటీనటులకు ప్రేమగా వండించి పెట్టడమూ ఇష్టమే.

ప్రభాస్ 23 సినిమాల కలెక్షన్స్ డీటెయిల్స్..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus