Prabhas: ప్రభాస్ 23 సినిమాల కలెక్షన్స్ డీటెయిల్స్..!

  • October 22, 2024 / 05:44 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ ‘కల్కి 2898 ad’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టి, సూపర్ ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ (The Rajasaab) అనే సినిమా చేస్తున్నాడు. మారుతి (Maruthi Dasari) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) నిర్మాత. వచ్చే ఏడాది అంటే ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ రొమాంటిక్ జోనర్లో రూపొందుతున్న సినిమా ఇది. ఇక దీంతో పాటు హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు.

Prabhas

అలాగే వచ్చే నెలలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit) కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. కాబట్టి అతని నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోపక్క అతని పాత సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. సో అభిమానులకి ఈసారి పెద్ద పండగే అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన సినిమాల కలెక్షన్ల వివరాలను ఒక లుక్కేద్దాం రండి :

1) ఈశ్వర్ (Eeswar) :

ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రాన్ని జయంత్.సి.పరాన్జీ (Jayanth C. Paranjee) డైరెక్ట్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కె.అశోక్ కుమార్ (Kolla Ashok Kumar) ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో అంటే 2002 టైంలో కోటిన్నర బడ్జెట్ లో తీసిన సినిమా ఇది. చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద రూ.2 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ చిత్రం.

2) రాఘవేంద్ర (Raghavendra) :

ప్రభాస్ హీరోగా సురేష్ కృష్ణ (Suresh Krishna) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘శ్రీ శ్రీ చిత్ర’ బ్యానర్ పై బి.శ్రీనివాస రాజు (Srinivasa Raju) నిర్మించారు. రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.2.7 కోట్ల వరకు మాత్రమే షేర్ ను రాబట్టింది.

3) వర్షం (Varsham) :

ప్రభాస్ (Prabhas) , త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ (Sobhan) దర్శకుడు. ‘సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై యం.యస్.రాజు (M. S. Raju) నిర్మించారు. 2004 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో ఏకంగా రూ.19.2 కోట్ల షేర్ ను రాబట్టింది.

4) అడవి రాముడు (Adavi Ramudu) :

ప్రభాస్, ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal) జంటగా నటించిన ఈ చిత్రానికి బి.గోపాల్ (PrabhasAarthi Agarwal) దర్శకుడు. ‘ఫ్రెండ్లీ మూవీస్’ బ్యానర్ పై చంటి అడ్డాల (Chanti Addala) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2004 సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం కేవలం రూ.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

5) చక్రం (Chakram) :

ప్రభాస్ హీరోగా ఆసిన్ (Asin Thottumkal) , ఛార్మి (Charmy Kaur) హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రానికి కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకుడు. 2005 లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.5.7 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

6) ఛత్రపతి (Chatrapathi)  :

ప్రభాస్, శ్రీయ (Shriya Saran) జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) దర్శకుడు. రూ.10.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.16.35 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7) పౌర్ణమి (Pournami) :

ప్రభాస్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2006 లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యింది. యం.యస్.రాజు ఈ చిత్రానికి నిర్మాత. సూపర్ హిట్ కాంబో.. కావడంతో ఈ సినిమాకు రూ.12 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రం కేవలం రూ.6.7 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలిపోయింది.

8) యోగి (Yogi) :

ప్రభాస్, నయనతార (Nayanthara) జంటగా నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ (V. V. Vinayak) దర్శకుడు. 2007 లో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టి.. క్లీన్ హిట్ గా నిలిచింది. ఇది ఒక అండర్ రేటెడ్ కమర్షియల్ హిట్ మూవీ అని చెప్పాలి.

9) మున్నా (Munna) :

ప్రభాస్, ఇలియానా (Ileana) జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకుడు. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో ప్రభాస్ చేసిన మొదటి సినిమా ఇది. రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.

10) బుజ్జిగాడు (Bujjigadu) :

ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

11) బిల్లా (Billa) :

ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద రూ.19 కోట్ల షేర్ ను రాబట్టింది.

12) ఏక్ నిరంజన్ (Ek Niranjan) :

ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద రూ.12.8 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది.

13) డార్లింగ్ (Darling) :

ప్రభాస్ – కరుణాకరణ్ (A. Karunakaran) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.16.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. బాక్సాఫీస్ వద్ద రూ.22.91 కోట్ల షేర్ ను రాబట్టింది.

14) మిస్టర్ పర్ఫెక్ట్ (Mr. Perfect) :

ప్రభాస్ – దశరథ్ (Dasaradh) కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.27.92 కోట్ల షేర్ ను రాబట్టింది

15) రెబల్ (Rebel) :

ప్రభాస్ – లారెన్స్ (Raghava Lawrence) కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం రూ.33 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో రూ.27.3 కోట్ల షేర్ ను రాబట్టింది.

16) మిర్చి (Mirchi) :

ప్రభాస్ – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా.. రూ.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.47.88 కోట్ల షేర్ ను రాబట్టింది.

17) బాహుబలి (Baahubali) (ది బిగినింగ్) :

రూ.148 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్ గా రూ.302.3 కోట్ల షేర్ ను రాబట్టింది.

18)బాహుబలి 2 (Baahubali 2) :

రూ.350 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.814.10 కోట్ల షేర్ ను రాబట్టింది.

19) సాహో (Sahoo) :

రూ.290 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.232.60 కోట్ల షేర్ ను రాబట్టింది.

20) రాధే శ్యామ్ (Radhe Shyam) :

రూ.200 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.86.41 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

21) ఆదిపురుష్ (Adipurush) :

రూ.230 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.196.58 కోట్ల షేర్ ను రాబట్టింది.

22) సలార్ (Salaar) :

రూ.338 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.326.05 కోట్ల షేర్ ను రాబట్టింది.

23) కల్కి 2898 ad (Kalki 2898 AD) :

రూ.385 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.530.62 కోట్ల షేర్ ను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus