Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

తమిళ స్టార్ హీరోగా సినీ రంగంలో అగ్రస్థానాన్ని సంపాదించిన విజయ్ , ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా తన ముద్ర వేసేందుకు ముందడుగు వేస్తున్నారు. ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ వినిపించిన విడాకుల వార్తలు అభిమానులను కలవరపరిచాయి. భార్య సంగీత కోర్టును ఆశ్రయించారన్న ప్రచారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Vijay joseph

కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, దాంపత్య జీవితంలో తలెత్తిన విభేదాల కారణంగా ఈ వ్యవహారం బయటకు వచ్చిందని చెబుతున్నారు. అయితే అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ఇదే సమయంలో తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ రాజకీయంగా చురుకుదనాన్ని ప్రదర్శిస్తున్న వేళ, వ్యక్తిగత జీవితం చుట్టూ వచ్చిన ఈ వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

అయితే తాజా పరిణామాలు కొత్త ఊహాగానాలకు దారితీశాయి. కుటుంబ పెద్దలు మధ్యవర్తిత్వం చేస్తూ సమస్యను సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరూ పునరాలోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే పిల్లలు అయిన కొడుకు జేసన్ సంజయ్ , కుమార్తె దివ్య షాషా కూడా తల్లిదండ్రులు ఇరువురితో మాట్లాడుతున్నట్టు సమాచారం. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో సంగీత ప్రత్యక్షమవుతారనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఒకవేళ అదే నిజమైతే, అది విజయ్ రాజకీయ ప్రయాణానికి ఊహించని బలం ఇవ్వొచ్చు. వ్యక్తిగత జీవితం,రాజకీయ ప్రయాణం కలిసిన ఈ కథలో అసలు నిజం ఏమిటో తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడాల్సిందే.

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus