టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు కొన్నేళ్ల క్రితం వరకు పరిమిత బడ్జెట్ లోనే సినిమాలను నిర్మించారు. ఈ విధంగా చేయడం వల్ల దిల్ రాజు నిర్మించిన సినిమాలు ఫ్లాప్ అయినా ఆ సినిమాల వల్ల దిల్ రాజుకు భారీ నష్టాలు రాలేదు. అయితే ఓటీటీల ఎంట్రీతో పాటు ప్రేక్షకుల అభిరుచి మారడంతో పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు కాలం చెల్లింది. అదే సమయంలో దిల్ రాజు సైతం రిస్కీ ప్రాజెక్ట్ ల దిశగా అడుగులు వేస్తున్నారు.
రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమాను, విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మరో సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగు హీరోకు తమిళ డైరెక్టర్ ను తమిళ హీరోకు తెలుగు డైరెక్టర్ ను ఎంపిక చేయడం ద్వారా సినిమాకు పాన్ ఇండియా పబ్లిసిటీ వచ్చే విషయంలో దిల్ రాజు ప్లాన్స్ సక్సెస్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంతకాలం సినిమాల ద్వారా సంపాదించుకున్న మొత్తాన్ని ఈ రెండు సినిమాలపై ఇన్వెస్ట్ చేశారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే దిల్ రాజుకు ఊహించని రేంజ్ లో లాభాలు వస్తాయని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలు ఫ్లాపైతే మాత్రం దిల్ రాజు భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే దిల్ రాజు పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ ఉండటం వల్లే ఈ సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు.
ఈ సినిమాల విషయంలో దిల్ రాజు ప్లానింగ్ రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో చూడాల్సి ఉంది. విజయ్ వంశీ పైడిపల్లి కాంబో మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుండగా చరణ్ శంకర్ కాంబో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత లేదు. ఈ రెండు ప్రాజెక్ట్ లు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని రికార్డులు క్రియేట్ చేస్తే రాబోయే రోజుల్లో దిల్ రాజు మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!