13 ఏళ్ళ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • July 25, 2021 / 08:35 PM IST

ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు బుల్లితెర పై చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ చిత్రం హీరో యశో సాగర్ ఈరోజున మన మధ్య లేకపోవడం విషాదకరమని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన స్నేహ ఉల్లాల్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఈమెకు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. 2008వ సంవత్సరం జూన్ 25న ఈ చిత్రం విడుదలైంది. అంటే నేటితో ఈ చిత్రం విడుదలై 13 ఏళ్ళు పూర్తికావస్తోందన్న మాట.

మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 1.75 cr
సీడెడ్ 0.64 cr
ఉత్తరాంధ్ర 0.97 cr
ఈస్ట్ 0.39 cr
వెస్ట్ 0.31 cr
గుంటూరు 0.64 cr
కృష్ణా 0.47 cr
నెల్లూరు 0.38 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.55 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 0.27 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  5.82 cr

 

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రానికి రూ.3.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.5.82 కోట్ల షేర్ ను రాబట్టి.. హిట్ గా నిలిచింది.ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.1.99 కోట్ల లాభాలు దక్కినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus