‘ఆర్ఆర్ఆర్’ లో మల్లి..అసలు పేరు ఏంటి? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

‘బాహుబలి’ (సిరీస్) తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పై మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లూరి సీతారామ రాజుగా రాంచరణ్ ను, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ను ఆయన చూపించబోతున్నాడు అని తెలిసి యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. కరోనా మొదలై 3 వేవ్ లు వచ్చినా ‘ఆర్.ఆర్.ఆర్’ పై క్రేజ్ తగ్గలేదు. ఇక మార్చి 25న విడుదలైన ఈ చిత్రం కొంత మిక్స్డ్ ను మూటకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా అందరూ ఆశించినట్టే రికార్డులు కొట్టడం మొదలుపెట్టింది.

Click Here To Watch NOW

మొదటి వీకెండ్ కు అదిరిపోయే కలెక్షన్లను నమోదు చేసిన ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా స్టార్మ్ ను చూపిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మల్లి పాత్ర పోషించిన అమ్మాయి అందరికీ గుర్తుండే ఉంటుంది. గోండ్ల అమ్మాయిగా ఈమె కనిపిస్తుంది. ఈమెను బ్రిటీష్ వారు తీసుకుపోతే.. ఈమెను తీసుకెళ్ళడానికి కొమరం భీమ్ అలియాస్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటీష్ వారు కొమరం భీమ్ ను పట్టుకునే బాధ్యతను అల్లూరి సీతారామరాజుకి అప్పగిస్తారు.

అక్కడి నుండీ కథ అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. అలా ఈ కథ అంతా ఈ మల్లి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ మల్లి ఎవరు? ఈమెను రాజమౌళి ఎక్కడి నుండీ పట్టుకొచ్చాడు వంటి ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో ఉన్నాయి. ఈమె అసలు పేరు ట్వింకిల్ శర్మ.ఈమె చండీగఢ్‌ కు చెందిన అమ్మాయి. గతంలో ఈమె డాన్స్ ఇండియా డాన్స్ అనే కాంపిటీషన్ లో పాల్గొని పాపులర్ అయ్యింది. అటు తర్వాత ఇండియాస్ బెస్ట్ డ్రమెబాజ్ లో టాప్ 8 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఈమె నిలిచింది.

జీ(హిందీ) ఛానల్ లో ప్రసారయ్యే అనేక ఈవెంట్స్ లో ఈమె పార్టిసిపేట్ చేసింది. వాటితో పాటు ఇంకా అనేక టీవీ షోస్ లో కూడా చేసింది. ఫ్లిప్‌కార్ట్ యాడ్స్ లో కూడా ఈమె నటించింది అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఈ సినిమా మొదలైనప్పుడు ఈమె 8 వ తరగతి చదువుతుందట. మొత్తానికి ఈమెకు ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus