Upasana: ఉపాసన కొణిదెల బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఉపాసన కొణిదెల.. పరిచయం అవసరం లేని పేరు. రాంచరణ్ భార్యగా, చిరంజీవి కోడలిగా మాత్రమే కాదు.. తన సోషల్ యాక్టివిటీస్ తో చాలా మంచి పేరు సంపాదించుకుంది. అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం తరపున కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈమె చేస్తున్న సేవలు గురించి అందరూ చెప్పుకుంటారు. ఇక సోషల్ మీడియాలో ఉపాసన చాలా చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. మంచి మంచి హెల్త్ టిప్స్ ని షేర్ చేస్తూనే, రాంచరణ్ కొత్త ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా.. గత నెలలో ఉపాసన (Upasana) పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ పాపకి కిమ్ క్లీంకార అని నామకరణం చేయడం కూడా జరిగింది. లలిత సహస్రనామం నుండి ఈ పేరుని తీసుకుని తమ పాపకి ఈ పేరు పెట్టారు ఉపాసన- చరణ్. పాజిటివ్ ఎనర్జీని అందరిలోనూ నింపేలా కూడా ఈ పేరు ఉంటుంది అని వారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు ఉపాసన తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది.

తన భర్త రాంచరణ్ తో కలిసి ఇంట్లో సింపుల్ గా తన భర్త డే ని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత… తన అభిమానులతో ఐ.టి.సి లో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మెగా అభిమానులు కూడా ఉపాసనకి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి :

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus