Upasana: లవ్ యూ మామ్ అంటూ ఉపాసన రియాక్షన్.. ఆ పోస్ట్ లో ఏం చెప్పారంటే?

  • July 3, 2023 / 01:40 PM IST

చరణ్ ఉపాసన దంపతుల కూతురుకు క్లింకార కొణిదెల అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులలో ఎక్కువ మందికి ఈ పేరు ఎంతగానో నచ్చింది. మెగా ప్రిన్సెస్ కు మంచి పేరును ఫిక్స్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే మెగా ప్రిన్సెస్ కు ఆ పేరు పెట్టడం వెనుక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉపాసన తల్లి శోభన కామినేని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

ఉపాసన కూతురు పేరును ప్రస్తావిస్తూ శోభన కామినేని ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేయడం గమనార్హం. శోభన కామినేని తన పోస్ట్ లో ఉపాసన పుట్టిన సమయంలో తనకు క్లింకార అని పేరు పెట్టాలని అనుకున్నామని అప్పుడు ఆ పేరు పెట్టలేకపోయినా ఇప్పుడు ఆ పేరు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఉపాసన కూతురుకు ఆ పేరు పెట్టడంతో చాలా ఆనందంగా ఉందని శోభన కామినేని తెలిపారు.

శోభన కామినేని పోస్ట్ ను చూసిన ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లవ్ యూ మామ్ అంటూ తన తల్లికి ఉపాసన ధన్యవాదాలు తెలియజేశారు. క్లింకార పేరును ఉపాసన ఇష్టం ప్రకారం పెట్టారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శోభన కామినేని చేసిన పోస్ట్ కు దాదాపుగా 18 వేల లైక్స్ వచ్చాయి. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీకి మరింత కలిసొస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చరణ్ (Upasana) ఉపాసనలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. చరణ్ సినిమాల ద్వారా భారీ స్థాయిలో సంపాదిస్తుండగా ఉపాసన వ్యాపారాల ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారు. చరణ్, ఉపాసన త్వరలో కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. సరైన సమయంలో మెగా ప్రిన్సెస్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తారని సమాచారం.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus