గత రెండు, మూడు రోజులుగా టాలీవుడ్ లో తెగ హడావిడి కనిపిస్తోంది. చిన్నా, పెద్ద, మీడియం అన్ని సినిమాల రిలీజ్ డేట్లను ఒకరి తరువాత మరొకరు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. దాదాపు ముప్పైకి పైగా సినిమా రిలీజ్ డేట్లను కన్ఫర్మ్ చేశారు. ఆఖరికి రిలీజ్ డేట్ విషయంలో ఓ నిర్ణయానికి రాలేని రాజమౌళి సైతం ‘ఆర్ఆర్ఆర్’ డేట్ ని లాక్ చేశాడు. అయితే ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అప్పుడెప్పుడో చిన్న టీజర్ ని వదిలారే తప్ప ఇప్పటివరకు మరో అప్డేట్ లేదు. కనీసం సినిమా టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను మే లేదా జూన్ నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారట.
టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ఒకేసారి విడుదల చేయాలనేది బోయపాటి ప్లాన్. ఇప్పటికే రిలీజ్ డేట్, టైటిల్ విషయంలో నిర్ణయానికి వచ్చారని.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. దాదాపు వేసవి బరిలోనే ఈ సినిమాను దింపాలని చూస్తున్నారు. అదే సమాయానికి చిరంజీవి ‘ఆచార్య’, వెంకీ ‘నారప్ప’ సినిమాలు కూడా రిలీజ్ కి ఉన్నాయి. మరి బాలయ్య ఏ డేట్ న వస్తాడో చూడాలి!
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!