Chiranjeevi: ‘లూసిఫర్’ రీమేక్.. చిరు కొత్త గెటప్!

తమిళ, మలయాళ సినిమాల్లో హీరోలు పంచెకట్టుతో కనిపించడం కామన్. విజయ్, అజిత్ లాంటి హీరోలు పంచెకట్టుతో కనిపిస్తే ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. పైగా వాళ్లకు పంచెకట్టు అనేది ఓ సంప్రదాయం. మన దగ్గర కూడా అలాంటి సంప్రదాయం ఉన్నప్పటికీ మన హీరోలు మాత్రం పెద్దగా పంచెలో కనిపించరు. ఏదో ఒకట్రెండు సీన్స్ లో కనిపించడానికి మాత్రం ఓకే చెప్తారు కానీ సినిమా మొత్తం పంచెకట్టులో కనిపించాలంటే అంత ఈజీగా ఒప్పుకోరు.

కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో మొత్తం పంచెకట్టులోనే కనిపిస్తారట. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరంజీవి తన తదుపరి చిత్రంగా ‘లూసిఫర్’ రీమేక్ ను తెరకెక్కించనున్నారు. మలయాళంలో హిట్ అయిన ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించారు. ఇందులో ఆయన పూర్తిగా పంచెకట్టులోనే కనిపించారు. వైట్ అండ్ వైట్ పంచెకట్టుతోనే సినిమా మొత్తం కనిపించారు. ఇప్పుడు చిరుని కూడా అదే లుక్ తో చూపించాలని దర్శకుడు మోహన్ రాజా భావిస్తున్నాడు.

రాజకీయాలకు ముడిపడి ఉన్న సబ్జెక్ట్ కావడంతో పంచెలో కనిపిస్తేనే బాగుటుందనేది దర్శకుడి ఆలోచన. ఇదే విషయాన్ని చిరుకి చెప్పగా.. దానికి ఆయన అంగీకరించారట. సినిమా మొత్తం మెగాస్టార్ పంచెకట్టులో కనిపించడమంటే అభిమానులకు ట్రీట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి ‘కింగ్ మేకర్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus