కన్నడ నటుడు అయినప్పటికీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటుడు ఉపేంద్రకు మంచి పేరు ఉంది. ఉపేంద్ర సినిమాలు సాధారణ సినిమాలకు భిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. పేద కుటుంబంలో జన్మించిన ఉపేంద్ర బాల్యంలో కంటి ఇన్ఫెక్షన్ తో బాధ పడ్డారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఉపేంద్రకు దూరపు బంధువైన కాశీనాథ్ ఉపేంద్రకు సినిమా ఆఫర్లు వచ్చేలా చేయడంలో సహాయపడ్డారు. 2003 సంవత్సరంలో ఉపేంద్ర తన సహనటి అయిన ప్రియాంకను పెళ్లి చేసుకున్నారు.
ఉపేంద్ర ప్రియాంకల వివాహం ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఒక సందర్భంలో ఉపేంద్ర మాట్లాడుతూ ‘రా’ సినిమా సమయంలో తనకు, ప్రియాంకకు మధ్య స్నేహం మొదలైందని హెచ్2ఓ సినిమా సమయానికి స్నేహం ప్రేమగా మారి ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చారు. రియల్ లైఫ్ లో ఉపేంద్ర ఇంట్రావర్ట్ కాగా ప్రేమలో ఉన్న సమయంలో ఈ జోడీ లాంగ్ డ్రైవ్స్ కు, డిన్నర్ డేట్స్ కు వెళ్లలేదు. పెళ్లి తర్వాత ప్రియాంక తక్కువ సమయంలోనే కన్నడ సాంప్రదాయాలను అలవరచుకున్నారు.
ఉపేంద్ర భార్య మిస్ కోల్ కతాగా కూడా ఎంపికయ్యారు. ఈ జంటకు ఆయుష్, ఐశ్వర్య పేర్లతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా ప్రియాంక సినిమాల్లో నటిస్తూ వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ప్రియాంక తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఉపేంద్ర నటుడిగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి ఉపేంద్రకు మంచిపేరు తెచ్చిపెట్టింది.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!