కొత్త హీరోకి ఇంత టార్గెటా.. రీచ్ అవ్వగలడా..?

  • February 9, 2021 / 05:48 PM IST

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.’నీ కన్ను నీలి సముద్రం’ అనే ఒక్క పాటతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లు అయితే ఆ అంచనాలను డబుల్ చేశాయనే చెప్పాలి.

ఇక ఫిబ్రవరి 12న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.ఆ వివరాలను ఓసారి పరిశీలిస్తే :

నైజాం  6.0 cr
సీడెడ్  3.0 cr
ఉత్తరాంధ్ర  10.0 cr
ఏపీ+తెలంగాణ (టోటల్)  19.0 cr
ఓవర్సీస్ + రెస్ట్ ఆఫ్ ఇండియా  1.5 cr
వరల్డ్ వైడ్ టోటల్  20.5 cr

‘ఉప్పెన’ చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. డెబ్యూ హీరోకి ఈ బిజినెస్ చాలా ఎక్కువనే చెప్పాలి. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ కి మాత్రమే ఈ స్థాయి బిజినెస్ జరిగింది. అయితే వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ కాబట్టి అప్పుడు అంత పెద్ద మొత్తం జరిగింది. కానీ ‘ఉప్పెన’ కు డైరెక్టర్ కు కూడా ఇది కొత్త సినిమానే..! మరి అంత పెద్ద టార్గెట్ ను ఈ చిత్రం చేజ్ చేస్తుందో లేదో చూడాలి.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus