Urvashi Rautela: నటి ఊర్వశీ రౌతెల వేసుకున్న డ్రెస్ ఎంతో తెలుసా?

  • April 29, 2023 / 12:53 PM IST

సినిమా ఒక ఫ్యాషన్..సినిమా ఒక కళ..సినిమాలో దర్శకుడు అనుకున్న సీన్ వచ్చే వరకు తీస్తానే ఉంటారు.. వారు అనుకున్న అవుట్ పుట్ రావటం కోసం ఎంత కష్టమైన పడ్డాతారు.. కొన్ని సీన్స్ కోసం వేల కోట్లు ఖర్చు పెడతారు. అలాగే పవన్ కళ్యాణ్ గుండుబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ప్యాంటు ఖరీదు రూ.లక్ష రూపాయిలని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే నటించిన పైసా సినిమాలో కూడా నాని ధరించిన డ్రెస్ కూడా చాలా ఖరీదని వార్తలు రావడం మనం చదివాం..

ఇప్పుడు నటి (Urvashi Rautela) ఊర్వశీ రౌతెల గురించి నెట్టింట ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ఆమె అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్‌’ చిత్రంలో ప్రత్యేక గీతంలో మెరిశారు. ‘వైల్డ్‌ సాలా’ అంటూ సాగే పక్కా మాస్‌గా పాటతో యువతను ఉర్రూతలూగించారు. టూ పీస్‌ డ్రస్‌లో ఎలక్ర్టిఫైయింగ్‌ ఎనర్జీతో సాగే పాటలో ఆల్ర్టా గ్లామరస్‌ అవుట్‌లుక్‌తో మెప్పించారు. ఆ పాటలో ఊర్వశీ ఆల్ర్టా గ్లామరస్‌ అవుట్‌లుక్‌లో కనిపించడానికి నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారట. దుస్తుల ఖరీదు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే అంటున్నారు.

ప్రముఖ స్టైలిస్ట్‌ కెన్‌ ఫెర్న్స్‌ డిజైన్‌ చేసిన ఆ దుస్తుల ఖరీదు అక్షరాల రూ.20లక్షలు. నూయార్క్‌లోని రెట్రోఫ్రెట్‌ బ్రాండ్‌లో రూపొందినవి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ దుస్తుల గురించే చర్చ నడుస్తోంది. టూ పీస్‌ డ్రస్‌ కోసం రూ.20 లక్షలు ఖర్చు చేశారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డ్రస్‌ కోసమే అంత ఖర్చు చేశారంటే.. ఇక ఊర్వశీకి పారితోషికంగా భారీగానే సమర్పించుకునే ఉంటారని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

సంక్రాంతి బరిలో విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ‘బాస్‌ పార్టీ’ సాంగ్‌తో యువత హృదయాలను దోచుకుంది ఊర్వశీ. ఇప్పుడు అఖిల్‌ సరసన ‘వైల్డ్ సాలా’ పాటతో మరోసారి మెప్పించింది. బోయపాటి శ్రీను – రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ ఊర్వశీ రౌతెల ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus