Pushpa2 Movie: ఇక అల్లు అభిమానులకు హాట్ జాతరే..!

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప.. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై భారీ విజయాన్ని అందించడమే కాకుండా నార్త్ ఇండియాలో ఎటువంటి అంచనాలు లేకుండా వంద కోట్ల క్లబ్లో చేరిపోయి రికార్డు సృష్టించింది. దీంతో ఒక్కసారిగా నార్త్ ఇండియన్స్ కూడా బన్నీకి అభిమానులు అయిపోయారు. ఇక ఆయన తదుపరి సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

ఇక అందులో భాగంగానే (Pushpa2) పుష్ప సీక్వెల్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బన్నీ. వచ్చే ఏడాది విడుదల కాబోయే సినిమాపై వారు విడుదల చేస్తున్న అప్డేట్లు నిజంగా భారీ హైప్ పెంచేస్తున్నాయనే చెప్పాలి.ఇక గంగమ్మ జాతరలో భాగంగా లేడీ గెటప్ లో కనిపించిన అల్లు అర్జున్ కచ్చితంగా ఊర మాస్ అందుకుంటాడు అంటూ అభిమానులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరొకవైపు ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి అభిమానులను హాట్ జాతర చేసుకునేలా చేస్తోంది. అసలు విషయంలోకి వెళితే పుష్ప సినిమాలో సమంత మొదటిసారి ఐటెం సాంగ్ లో చేసి యువతను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇక పుష్ప 2 లో కూడా ఆమె నటిస్తుంది అంటూ అందరూ అనుకున్నారు.

కానీ ఆమె ఈ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ చెప్పడంతో ఇప్పుడు ఆమె స్థానంలో ప్రేక్షకులను అలరించడానికి ప్రముఖ గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌటేలను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో బన్నీ సరసన ఐటమ్ సాంగ్ లో మెరవడానికి ఊర్వశీని డైరెక్టర్ సుకుమార్ తీసుకోబోతున్నారని సమాచారం. మరి ఇదే నిజమైతే అభిమానులకు ఇక మాస్ హాట్ జాతరే అని చెప్పవచ్చు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus