Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ తో పవన్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరనుందా?

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ గురించి వినగానే గబ్బర్ సింగ్ సినిమా గుర్తుకు వస్తుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు బండ్ల గణేష్ కు ఊహించని స్థాయిలో లాభాలను అందించింది. అయితే పవన్ హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో అదే విధంగా చూపించనున్నారని సమాచారం.

హరీష్ శంకర్ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నా డిసెంబర్ లో ఓజీ మూవీ రిలీజ్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ మారే అవకాశం అయితే ఉంటుంది. పవన్ నిజ జీవితానికి దగ్గరగా ఉండే డైలాగ్స్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉన్నాయని ఆ డైలాగ్స్ పవన్ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ పవన్ నోటి ఉంచి వింటే చూడటానికి రెండు కళ్లు చాలవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ సన్నివేశాలు (Ustaad Bhagat Singh) ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం. మైత్రీ నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ సైతం కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. పవన్ హరీష్ శంకర్ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ అయితే రానున్నాయని సమాచారం అందుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus