Vaishnavi Chaitanya: వైష్టవి తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే అయ్యోపాపం అనకుండా ఉండలేరు!

Advertisement

వైష్ణవి చైతన్య గురించి వెండితెరపై సినిమాలు చూసేవారికి పెద్దగా పరిచయం లేదు కానీ.. టిక్‌ టాక్‌ వీడియోలు, యూట్యూబ్‌ షార్ట్‌ ఫిలింస్‌ చూసే వారికి ఈమె సుపరిచితురాలే. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వెబ్‌ సిరీస్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అల వైకుంఠపురం, టక్‌ జగదీష్, వరుడు కావలెను వంటి పలు సినిమాల్లో ఈ అమ్మడు కీలకపాత్రలు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌ యూత్‌ జపిస్తున్న మంత్రం వైష్ణవి చైతన్య. రెండు రోజుల కిందట రిలీజైన బేబి సినిమాలో తన పర్‌ఫార్మెన్స్‌తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

సినిమా చూసిన ప్రతీ ఒక్కరు వైష్ణవి (Vaishnavi Chaitanya) క్యారెక్టర్‌ను బండ బూతులు తిడుతున్నారు. అంటే నెగెటీవ్‌ క్యారెక్టర్‌లో ఏ లెవల్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డెబ్యూ సినిమాలోనే అన్నన్ని వేరేయేషన్లు చూపించడం మాములు విషయం కాదు. ఒక తెలుగు హీరోయిన్‌కు తొలి సినిమాతోనే ఈ రేంజ్‌ గుర్తింపు రావడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు. ఖచ్చితంగా ది బెస్ట్‌ డెబ్యూ పర్‌ఫార్మెన్స్‌లలో వైష్ణవి చైతన్య నటన ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈమె తన తొలి సంపాదన గురించి అభిమానులతో పంచుకుని అందరిని షాక్‌కు గురిచేసింది. తాజాగా ఓ ఇంటర్వూలో వైష్ణవి తన తొలి పారితోషికం రూ.700 అని చెప్పింది. ఒక ఈవెంట్ కోసం డ్యాన్స్ చేసే అవకాశం రాగా.. రోజంతా చాలా కష్టపడి డ్యాన్స్ చేస్తే ఏడొందల రూపాయలు ఇచ్చారని వైష్ణవి చెప్పింది.

కానీ ఇప్పుడు ఎంత సంపాదించినా ఆ ఏడొందలే తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీకు అవకాశాలు క్యూ కడతున్నాయని సమాచారం. బేబి సినిమాలో ఆమె పర్‌ఫార్మెన్స్‌ చూసి చాలా మంది దర్శక, నిర్మాతలు అమెను అప్రోచ్‌ అవుతున్నారని ఇన్‌సైడ్‌ టాక్‌.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus