3 ఏళ్ళ తరువాత ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు పూర్తిచేసుకుంది. అనేక ఒడుదుడుకులు మధ్య కూడా ఈ చిత్రం బాగానే కలెక్ట్ చేసింది కానీ.. బ్రేక్ ఈవెన్ కు అవి సరిపోవడం లేదు.దానికి ప్రధాన కారణాలు కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అలాగే ఏపీ ప్రభుత్వం ఈ చిత్రం టికెట్ రేట్లను దారుణంగా తగ్గించెయ్యడం వంటివే అని చెప్పాలి.
ఇక ‘వకీల్ సాబ్’ 2 వారాల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 24.25 cr |
సీడెడ్ | 12.84 cr |
ఉత్తరాంధ్ర | 11.72 cr |
ఈస్ట్ | 6.17 cr |
వెస్ట్ | 7.19 cr |
గుంటూరు | 7.09 cr |
కృష్ణా | 4.91 cr |
నెల్లూరు | 3.34 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 77.51 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.58 cr |
ఓవర్సీస్ | 3.84 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 84.93 cr |
‘వకీల్ సాబ్’ చిత్రానికి 89.85కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.2 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 84.93 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 5.57 కోట్ల షేర్ ను రాబట్టాలి. తెలంగాణాలో చాలా వరకూ థియేటర్లు మూత పడ్డాయి. వీకెండ్ వరకూ వకీల్ సాబ్ ప్రదర్శించబడుతున్న థియేటర్లు రన్ అవుతాయట. ఇక ఏపీలో 50శాతం సీటింగ్ కెపాసిటీ తో థియేటర్లు రన్ అవుతున్నాయి. ఈ వీకెండ్ తో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించేది లేనిది తేలిపోనుంది.
Click Here To Read Movie Review
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!