టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత గత కొంతకాలంగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత లాగే మరి కొంతమంది హీరోయిన్లు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు ఇదివరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను బహిరంగంగా తెలియజేశారు. అయితే తాను కూడా ఇలాంటి వ్యాధితోనే బాధపడుతున్నాను అంటూ తాజాగా నటి వనిత విజయ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నటి మంజుల విజయ్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి వనిత విజయ్ కుమార్ పలు సినిమాలలో నటించారు.
అయితే ఈమె సినిమాల పరంగా కాకుండా తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు. ఈమె ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు భర్తలకు విడాకులు ఇవ్వడంతో ఒకసారిగా వార్తల్లో నిలిచారు. ఇలా వనిత విజయ్ కుమార్ తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలిచారని చెప్పాలి. ఇకపోతే వనిత విజయ్ కుమార్ ఇప్పటికి నటిగా పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా పవిత్ర లోకేష్ నరేష్ హీరో హీరోయిన్లుగా నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో ఈమె రమ్య రఘుపతి పాత్రను పోషించారు.
ప్రస్తుతం తిరిగి కెరియర్లో బిజీ అవుతున్నటువంటి వనిత విజయ్ కుమార్ గత కొంతకాలం నుంచి ఒక విచిత్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది. తాజాగా ఈమె తాను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి బయటపెట్టారు. తాను గత కొంతకాలంగా క్లాస్ట్రోఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నానని ఈమె తెలియజేశారు ఈ వ్యాధి కారణంగా చిన్నచిన్న ప్రదేశాలలో తాను ఎక్కువసేపు ఉండాలంటే తనకు చాలా భయం వేస్తుందని ఈమె తెలియజేశారు.
లిఫ్ట్ వాష్ రూమ్ వంటి ప్రదేశాలలో తాను ఎక్కువసేపు ఉండలేనని అలాగే కిటికీలు లేకపోయినా జన సమూహాలలోఎక్కువగా ఉండాలి అంటే ఊపిరాడని భావన కలిగించడాన్నే క్లాస్ట్రోఫోబియా అంటారు. ఇలా ఈమె కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నానంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!