వనిత విజయ్ కుమార్ జీవితంలో తాజాగా మరో విషాధం చోటు చేసుకుంది. ఆమె మూడో భర్త పీటర్ పాల్ మృతిచెందాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు పీటర్ పాల్. పరిస్థితి మరింత విషమించడంతో మృతిచెందాడు. భర్త మృతిపట్ల వనిత విజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ‘వనిత మూడో భర్త మృతి’ అంటూ అన్ని న్యూస్ ఛానళ్లు, వెబ్‌సైట్లు వార్తలను ప్రచురించాయి. ఈ నేపథ్యంతో తాజా వార్తలపై వనిత విజయ్‌కుమార్ స్పందించారు.
‘‘పీటర్ పాల్ మృతి ఘటనపై స్పందించాలా? వద్దా? అన్న సందిగ్ధంతో చాలా ఓపిక పట్టాను. నాకు అవకాశం లేకుండా చేశారు. అన్ని మీడియా సంస్థలు, న్యూస్ ఛానళ్ల మీద ఉన్న గౌరవంతో ఒక విషయం గుర్తు చేస్తున్నా. పీటర్‌పాల్‌తో నాకు న్యాయబద్ధంగా వివాహం జరగలేదు. 2020లో కొన్ని రోజలు పాటు ఆయనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా. అది ఆ సంవత్సరమే ముగిసింది. నేను ఆయన భార్యను కాదు. ఆయన నా భర్తా కాదు. ‘వనిత విజయ్‌కుమార్ భర్త చనిపోయాడు’ అంటూ రాస్తున్న వార్తలను ఆపేయండి.
నాకు భర్తలేడు. ఒంటరిగానే ఉంటున్నా. ఏ విషయానికి నేను బాధపడటం లేదు. నేను చాలా సంతోషంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. మీ అందరికీ ఇదే నా విన్నపం. మిస్-వనిత విజయ్‌కుమార్’’ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వనిత పోస్టు పెట్టారు.అయితే దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఉన్నంత వరకు ఆయనతో ఉండి చనిపోయాక ఎవరో తెలీదంటున్నారా అని అంటున్నారు. తమిళ సీనియర్ నటీనటులు విజయ్ కుమార్, మంజుల కుమార్తెగా వనిత అందరికీ సుపరిచితమే.
తన(Actress) చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తండ్రితో ఆస్తి గొడవలు.. పెళ్లిళ్ల విషయంలో వివాదాలతో పలుమార్లు ఆమె వార్తల్లో నిలిచారు. ఆమెకు రెండు పెళ్లిళ్లు విఫలం కాగా.. కొన్నేళ్ల కిందట పీటర్ పాల్ అనే ఫిలిం మేకర్‌ను వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పట్లో షేర్ చేశారు. ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. వనిత.. తెలుగులో సీనియర్ నరేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాలో ఆయన నిజ జీవిత రెండో భార్య పాత్రలో నటిస్తున్నారు.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా