Varalakshmi Sarathkumar: బుల్లి గౌనులో వరలక్ష్మీ శరత్ కుమార్.. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది వరలక్ష్మి. ‘పందెం కోడి’ ‘సర్కారు’ వంటి చిత్రాల్లో ఈమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ చిత్రంలో కూడా ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన ‘క్రాక్’ తో ఈమెకు మంచి బ్రేక్ వచ్చింది. ఆ చిత్రంలో లేడీ విలన్ గా ఈమె చేసిన పెర్ఫార్మన్స్ సూపర్ అనే చెప్పాలి.

ఆ సినిమా తర్వాత ‘నాంది’ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రంలో కూడా ఆద్య పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో అయితే వరలక్ష్మి హీరో కంటే కూడా ఎక్కువ మార్కులు కొట్టేసింది అనే చెప్పాలి. దీంతో తెలుగులో ఆమె బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఈమె నటిస్తోంది. తెలుగులో వరుస అవకాశాలు వస్తుండడంతో ఈ మధ్యనే హైదరాబాద్ కు మకాం మార్చేసింది.

సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఛాన్స్ దొరికిన ప్రతీసారి గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా బుల్లి గౌనులో ఈమె చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అవుతుంది. ఈ ఫోటోలను ఓ వీడియో ఫార్మేట్ లో తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ అమ్మడు.. “మీ పై మీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే మీరు కోరుకున్నది ఎప్పుడైనా, ఏదైనా సాధించుకోగలరు. మీరు ఏం చేయాలి? ఏం చేయకూడదు..

అనే విషయాలు ఎదుటివాళ్లు మీకు చెప్పే అవకాశం ఇవ్వకండి. ఆత్మవిశ్వాసమే గొప్ప ఆయుధం.. మీపై మీకు నమ్మకం ఉండాలి.. మీకు మీరే గట్టి పోటీ అని బలంగా నమ్మండి..అప్పుడు మీరు ఏం సాధించగలరో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు” అంటూ కొన్ని ఇన్స్పిరేషనల్ కామెంట్స్ చేసింది.

1

2

3

4


1

2

3

4


1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus